భక్తులను కట్టిపడేస్తున్న పంచముఖ దశావతార వినాయక ప్రతిమ
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని పెద్ద ఉదయపురంలో రౌడీ బాయ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి దశావతార వినాయక ప్రతిమ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పన్నెండు అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పుతో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల భారీ రద్దీతో పూజ మందిరం కళకళలాడుతుండగా, పదకొండు రోజుల పాటు పూజలు నిర్వహించి ఘనంగా నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.