పప్పు దినుసులతో అద్భుతమైన వినాయక విగ్రహాన్ని తీర్చిదిద్దిన కళాకారుడు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశిబుగ్గ గాంధీనగర్ లో వినాయక చవితి వేడుకల సందర్భంగా కొత్తపల్లి రమేష్ ఆచారి వంట గదిలో ఉపయోగించే సుమారు 35 రకాల పప్పు దినుసులతో అద్భుతమైన వినాయక విగ్రహాన్ని తయారుచేశారు. ఈ విగ్రహ తయారీకి నాలుగు గంటల సమయం పట్టినట్లు ఆయన తెలిపారు. భక్తిభావంతో వినూత్న రీతిలో పప్పు దినుసులతో గణపతిని తీర్చిదిద్దిన కళాకారుడి నైపుణ్యాన్ని స్థానికులు మరియు భక్తులు ఎంతగానో ప్రశంసించారు.