జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పణ

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

ఐజేయూ, ఏపీయుడబ్ల్యూజే పిలుపు మేరకు విజయనగరంలో వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెల దినం నిర్వహించారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే లోకం మాధవితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డికి ఏపీయుడబ్ల్యూజే నాయకులు వినతిపత్రాలు అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో నిరసన తెలపడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.