అద్భుత ఆవిష్కరణ: శబ్ద తరంగాలతో మంటలను ఆర్పే పరికరం కనిపెట్టిన యువతి

రిపోర్టర్: సురేష్ స్థలం: Altamira

ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ప్రదర్శనలో మెక్సికోకు చెందిన పదిహేడేళ్ల విద్యార్థిని ఏంజెలా కరీమ్ వెనెగాస్ హెర్నాండెజ్ స్వర్ణ పతకం సాధించినట్లు మీడియా తెలిపింది. నీరు లేదా రసాయనాలు కాకుండా తక్కువ పౌనఃపున్యం గల శబ్ద తరంగాలను ఉపయోగించి మంటలను ఆర్పే సరికొత్త వోర్టెక్స్ టెక్ ఫైర్ ఎక్స్టింగ్ విషర్ను ఆమె రూపొందించారు. ఈ వినూత్న పరికరం ఆక్సిజన్ను పక్కకు నెట్టి మంటలను ఆర్పుతుందని, దీని తయారీకి ఏడాది పాటు శ్రమించామని ఆమె వెల్లడించారు.