సెనేట్ విచారణలో ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: World

అమెరికా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ విచారణలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, డెమోక్రటిక్ సెనేటర్ పీటర్ వెల్చ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఎఫ్‌బీఐ జోక్యం చేసుకోదని హామీ ఇవ్వాలన్న డిమాండ్‌ను కాష్ పటేల్ తీవ్రంగా తిరస్కరించారు. వెల్చ్ ఆరోపణలను అబద్ధాల నాటకంగా అభివర్ణిస్తూ, మీ సమయం ముగిసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.