అర్నబ్ తుపాను ముప్పు: రాగల నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
అర్నబ్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ రాగల నలభై ఎనిమిది గంటల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక సూచనలు చేశారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు సిద్ధం చేసిందని మంత్రి వెల్లడించారు.