సింగరేణి కార్మిక గర్జన సభకు బెల్లంపల్లి నేతల కదలిక: కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి కార్మిక గర్జన సభకు బెల్లంపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు మేరకు నాయకులు, కార్మికులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. 3వ వార్డు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం అండగా ఉంటామని స్పష్టం చేశారు.