ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యం: పూర్తి జీతంతో లీవ్ ఇచ్చిన సీఈవో
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగికి పూర్తి జీతంతో సెలవు మంజూరు చేసి ఆదర్శంగా నిలిచారు రెవ్ గ్రోత్ సంస్థ వ్యవస్థాపకుడు మరియు సీఈవో కార్తీక్ రాజా. సెలవులు అయిపోయినా సరే ఉద్యోగులు ఆరోగ్యం ముందే ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. రిమోట్ వర్క్ చేసే ఉద్యోగులు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొనే సమయంలో కంపెనీలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారిని కేవలం వనరులుగా చూడకూడదని సోషల్ మీడియా వేదికగా కార్తీక్ రాజా హితవు పలికారు.