ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని పుల్లంపేటలో భారీ రక్తదాన శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుల్లంపేట

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్, నాయకుడు చెంగల్రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే ఇటువంటి మానవతా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొని రక్తదానం చేశారు.