తలైవాపై అభిమానం: పూర్తి థియేటర్ బుక్ చేసిన క్రికెటర్ సంజు శాంసన్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

తలైవా రజినీకాంత్ పై తనకున్న వీరాభిమానాన్ని భారత స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ మరోసారి చాటుకున్నారు. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ 2 సినిమాను కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి చూసేందుకు సంజు శాంసన్ ఒక పూర్తి సినిమా థియేటర్ హాల్ ను పూర్తిగా బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో కార్యక్రమం ఉండటం వల్ల మొదటి రోజు సినిమా చూడలేకపోయానని, అందుకే ఒక రోజు ఆలస్యంగా ప్రత్యేకంగా స్క్రీన్ రిజర్వ్ చేసి చూస్తున్నానని సంజు శాంసన్ తెలిపారు.