కొండయ్య వైద్యానికి భరోసానిచ్చిన మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh
అయ్యప్ప చౌదరి అనే నెటిజన్ చేసిన విజ్ఞప్తికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. కొండయ్య గారి వైద్య బాధ్యతలను తాము చూసుకుంటామని హామీ ఇస్తూ, తన కార్యాలయం దీనిపై ఫాలోఅప్ చేస్తుందని ట్విట్టర్ వేదికగా భరోసా కల్పించారు. ఒంగోలుకు చెందిన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ పత్రం సోషల్ మీడియాలో వైరల్ కాగా, స్పందించిన మంత్రి లోకేష్ మానవత్వం చాటుకున్నారు.