ఖైదీలకు ఉచిత న్యాయసహాయం అందించడమే మా లక్ష్యం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా లాయర్‌ను సమకూరుస్తామని స్పష్టం చేశారు. నేర ప్రవృత్తిని వీడి మంచి పౌరులుగా మారాలని ఖైదీలకు హితవు పలికారు. జైల్లోని వంటగది, లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు అందజేశారు.