నియోజకవర్గాల అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున కేటాయించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. డబ్బు ఒక్కటే విజయాన్ని అందించదని, ప్రజలతో మమేకమై పనిచేయడమే గెలుపునకు మూలమని స్పష్టం చేశారు.