పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత.. తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట అశోక్ నగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ గద్దెను అర్ధరాత్రి ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ వేలాది మంది పోలీసులతో ఈ చర్యకు పాల్పడ్డారని నేతలు ఆరోపించారు.
రామప్ప, పాకాల చెరువు ప్రాజెక్టులు తెచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని, ప్రతి గ్రామంలోనూ విగ్రహాలు ఏర్పాటు చేసి తీరుతామని హెచ్చరించారు.