విద్యార్థులకు అలర్ట్: త్వరలోనే విడుదల కానున్న సీడీఎస్ 2 ఫలితాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సీడీఎస్ 2 పరీక్షా ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత సెప్టెంబర్ 13న ఈ రాత పరీక్ష జరుగగా, అక్టోబర్ 8 లేదా 9 తేదీల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలు, అర్హత వివరాలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.