రాజకీయ సంచలనం: జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.