నాకు చెడు చేస్తే మాత్రం అస్సలు మరిచిపోను: స్మృతి మంధాన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వరల్డ్ కప్ ఓటమే తన కెరీర్లో అత్యంత కఠినమైన రాత్రి అని తెలిపారు. తాను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కాదని, కానీ తనకు చెడు చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మరిచిపోనని స్పష్టం చేశారు. మనుషులను క్షమిస్తానని, కానీ వారు చేసిన దాన్ని మర్చిపోనని ఆమె కుండబద్దలు కొట్టారు.