విమానంలో వినాయకుడి చిత్రం గీసి వివాదంలో చిక్కుకున్న ఆర్టిస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
ప్రయాణ సమయంలో విమాన కిటికీపై వినాయకుడి చిత్రం గీస్తున్నట్లుగా వీడియో షేర్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆర్టిస్ట్ మిథాలి సలుంకే, తాను నేరుగా కిటికీపై పెయింటింగ్ వేయలేదని, కేవలం పారదర్శక పత్రంపై గీసి కిటికీకి అంటించానని వివరణ ఇచ్చారు. విమాన ప్రయాణంలో వినాయక చవితి సందర్భంగా ఆమె చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆస్తుల ధ్వంసంపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆమె తన వద్ద ఉన్న పెయింటింగ్ షీట్‌ను చూపించి స్పష్టతనిచ్చారు.