ఓటు చోరీకి వ్యతిరేకంగా చలో ఢిల్లీని విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే కసిరెడ్డి

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నవంబర్ మొదటి తేదీన ఢిల్లీలోని రాష్ట్రీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యవస్థలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు మోఠ్యా ఎత్తున తరలిరావాలని కోరారు.