యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాదం: పులి దాడిలో వ్యక్తి దుర్మరణం
రిపోర్టర్: నరేష్
స్థలం: London
ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో సిబ్బంది కళ్లుగప్పి పులి ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ఓ వ్యక్తి ఆ క్రూరమృగం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడని, ఘటన నేపథ్యంలో ఆదివారం పార్క్‌ను మూసివేశామని యాజమాన్యం వెల్లడించింది. పులిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేసిన అధికారులు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.