పోషణ మాసంలో పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యమని చాటిన రాజాపేట

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని నమిల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషకాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు పద్మ, శోభారాణి, విజయలక్ష్మి ఆధ్వర్యంలో తల్లులు, పిల్లలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపసర్పంచ్ మార్క శివకుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా లభించే ఆకుకూరలు, పాలు, ఉడకబెట్టిన గుడ్లను పిల్లలకు క్రమం తప్పకుండా తినిపించి ఆరోగ్యంగా పెంచాలని పిలుపునిచ్చారు.