కొండాపూర్ ఆసుపత్రి అభివృద్ధికి పది లక్షల నిధులు కేటాయింపు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన నిమిత్తం పది లక్షల రూపాయల ఎమ్మెల్యే నిధులను ప్రతిపాదిస్తూ కలెక్టర్‌కు పంపిన మంజూరు పత్రాలను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ స్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని, త్వరలోనే వంద పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.