చెన్నైలో బాలికలపై లైంగిక దాడి కేసులో గ్రానైట్ వ్యాపారి వీరమణి అరెస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Chennai

చెన్నైలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో జెమ్ గ్రానైట్స్ అధినేత ఆర్ వీరమణిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు దొరకలేదంటూ ఈ కేసును మూసివేయాలని భావించినప్పటికీ, ప్రత్యేక కోర్టు ఆదేశాలతో దర్యాప్తు పునఃప్రారంభమైంది. ఈ విచారణలో మరో ఏడుగురు మైనర్ బాలికలు వీరమణి తమపై లైంగిక దాడికి పాల్పడినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.