మహేష్ బాబు, రాజమౌళికి ఎన్నికల సంఘం నోటీసులు!
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా సినీ, క్రీడా ప్రముఖులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సమంత, విజయ్ దేవరకోండతో పాటు సైనా నెహ్వాల్, వివిఎస్ లక్ష్మణ్ వంటి ప్రముఖులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుల్లో వివరాలు సరిపోకపోవడంతో ఆధారాలు సమర్పించి తప్పులను సరిచేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.