హర్యానా పాఠశాలలో బాలికపై దాడి ఘటన: జువెనైల్ కస్టడీ నుండి విద్యార్థి విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: పంచకుల
హర్యానా లోని పంచకుల పాఠశాలలో కిండర్ గార్డెన్ బాలికపై రాళ్లు, పూలకుండీ తో దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని జువెనైల్ జస్టిస్ బోర్డు కస్టడీ నుండి విడుదల చేసింది. నిందితుడికి ఎలాంటి నేర నేపథ్యం లేదని, అతడి విద్యాభ్యాసానికి ఇబ్బంది కలుగకూడదని రక్షణ కల్పించాలని బాలిక తండ్రి తరఫు న్యాయవాది వాదించారు. ఈ మేరకు అదనపు కౌన్సెలింగ్ తో పాటు తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.