నిర్మల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఇన్చార్జిగా నల్లుల సంగీత

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది నల్లుల సంగీతను బీజేపీ మహిళా మోర్చా నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నల్లుల సంగీత మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్లుతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.