మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులపై ఈడీ విచారణలో అంబటి రాంబాబు వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
మద్యం రవాణా సబ్ కాంట్రాక్టుల కోసం ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డికి తాను సిఫారసు చేసినట్లు ఈడీ విచారణలో వైకాపా నేత అంబటి రాంబాబు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో బుధవారం జరిగిన విచారణకు హాజరైన ఆయన, సత్తెనపల్లికి చెందిన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రుసుం మినహాయింపు విషయమై మాట్లాడానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని రాంబాబు స్పష్టం చేశారు.