బెల్లంపల్లిలో ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి: విగ్రహానికి పూలమాలలు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ ఏరియాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్మికుల సంక్షేమం కోసం వెంకటస్వామి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తామంతా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.