సీఎం చంద్రబాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు ఘనంగా ఆహ్వానించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం అందించగా, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చంద్రబాబు చర్చించారు.