పీజీ వైద్య పరీక్షల మూల్యాంకనంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని టీ-జూడా డిమాండ్
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
పీజీ వైద్య పరీక్షల మూల్యాంకన విధానంలో భారీ వ్యత్యాసాలపై సమగ్ర సమీక్ష, స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ను టీ-జూడా డిమాండ్ చేసిందని అధ్యక్షులు డాక్టర్ విక్రమ్ తెలిపారు. కొద్ది మార్కుల తేడాతో అర్హత కోల్పోయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని, పారదర్శక రీవాల్యుయేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. థియరీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేయడం ఆందోళనకరమని, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.