దట్టమైన పొగమంచుతో తెల్లవారుజామునే చలి గుప్పిట్లోకి జారుకున్న నర్సంపేట ప్రాంతం
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఖానాపూర్ వెళ్లే ప్రధాన రహదారితో పాటు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచే వీస్తున్న చలిగాలులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన మంచు ప్రభావంతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వాహనాల హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. శీతాకాలం ప్రారంభం కావడంతో నర్సంపేట డివిజన్ పరిసరాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. ప్రజలు చలితీవ్రతతో బయటకు రావడానికి జంకారు.