తిమ్మిశెట్టిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ హోరెత్తిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వే కోడూరు

కోడూరు మండలం తిమ్మిశెట్టిపల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించారు. మాతమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం, ఇంటింటికీ తిరిగి జగన్ హయాంలోని సంక్షేమ పథకాలను వివరించారు. అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.