పులివెందులలో ఉద్రిక్తత: పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లపై టీడీపీ వర్గాల దాడి
రిపోర్టర్: హరి
స్థలం: పులివెందుల
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ బూట్ల వద్ద టీడీపీ శ్రేణులు అరాచకానికి పాల్పడుతూ ఓటర్లను అడ్డుకుంటున్నాయని, జాతీయ మీడియా కెమెరాను ధ్వంసం చేశారని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోకుండా పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తూ ఓటర్లు జూనియర్ కళాశాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.