యువ ఆవిష్కర్తలకు గుడ్ న్యూస్: గీతం ఇన్నోవేషన్ చాలెంజ్ 2026 ప్రకటన
రిపోర్టర్: సురేష్
స్థలం: పటాన్చెరు
దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తల ప్రతిభను వెలికితీసేందుకు గీతం డీమ్డ్ యూనివర్సిటీ గీతం ఇన్నోవేషన్ చాలెంజ్ 2026 ఆరో ఎడిషన్ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ జాతీయ స్థాయి పోటీలో ప్రతిభ కనబర్చిన వారికి దాదాపు యాభై లక్షల రూపాయల నగదు పురస్కారంతో పాటు నిపుణుల మార్గదర్శకం, వెంచర్ కోచింగ్, స్టార్టప్ ఇన్క్యుబేషన్ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల ఏడో తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.