విజయవాడలో ఉద్రిక్తత డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఇరువర్గాల ఆందోళన
రిపోర్టర్: కిరణ్
స్థలం: Vijayawada
విజయవాడలోని లబ్బీపేట ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా, తమ నియామకాలను సమర్థిస్తూ ఉపాధ్యాయులు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఒక ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది.