శాకాజిపురంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు మరియు మహా అన్నదానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడు
గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా 9వ రోజు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగలి కృష్ణ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.