పుణేలో ఎంపీఎస్సీ అభ్యర్థి కిడ్నాప్, ఇద్దరు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని పుణేలో ఓ మహిళతో వివాదం కారణంగా ఎంపీఎస్సీ అభ్యర్థి ప్రసాద్ సూర్యవంశీని కొందరి దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, సింహగడ్ రోడ్డులో వాహనాన్ని వెంబడించి బాధితుడిని రక్షించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.