అమెరికాలో ఉత్కంఠగా మారిన ఓహియో మధ్యంతర ఎన్నికల బరి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Ohio
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా మారిన ఓహియో మధ్యంతర ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోందని పరిశీలకులు తెలిపారు. నవంబర్ మూడున జరగనున్న ఈ ఎన్నికల్ లో గవర్నర్ పదవికి రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి, డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే పదిహేను హౌస్ స్థానాలతో పాటు సెనెట్ స్థానాలపై కూడా సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికా దేశ రాజకీయాల్ లో అత్యంత కీలకం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.