భారీ వర్షాలకు నీటమునిగిన కిర్లంపూడి పంట పొలాలు

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి మండలం సోమరాయణంపేట - బూరుగుపూడి మధ్య భారీ వర్షాల ప్రభావంతో పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. పొలాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు చేరడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే సాగు చేసిన పంటలు నీటిలో మునిగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.