వాహనదారులకు గుడ్ న్యూస్: మహింద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో జెడ్ ఎన్ జీకి ఫైవ్ స్టార్ రేటింగ్
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
భారత ఆటోమొబైల్ రంగంలో భద్రతకు పెద్దపీట వేస్తూ మహింద్రా సరికొత్త రికార్డు సృష్టించిందని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్టులలో మహింద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ వో జెడ్ ఎన్ జీ మోడల్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. తద్వారా దేశంలోనే ఈ అరుదైన ఘనత సాధించిన మొట్టమొదటి సబ్ కాంపాక్ట్ సీఎన్జీ ఎస్ యూవీగా నిలిచింది. వయోజన ప్రయాణీకుల రక్షణ విభాగంతో పాటు పిల్లల రక్షణ విభాగంలోనూ ఈ వాహనం అత్యుత్తమ స్కోరును సాధించిందని నిపుణులు వెల్లడించారు.