ప్రతిష్టాత్మక బిఐఎస్ లైసెన్సులు సాధించిన ఏఎమ్ఎన్ఎస్ ఇండియా ఉక్కు సంస్థ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ అర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లైసెన్సులను సాధించి ప్రత్యేక స్టీల్ తయారీ విభాగంలో తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. గుజరాత్లోని హజీరా, మహారాష్ట్రలోని పూణే ప్లాంట్లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఉత్పత్తులు విదేశాల దిగుమతులపై ఆధారపడే అవసరాన్ని తగ్గించి ఆత్మనిర్భర్ భారత్ పిలుపునకు బలమైన మద్దతును అందిస్తున్నాయి.