బెంగళూరులో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: బెంగళూరు

కర్ణాటక రాజధాని బెంగళూరులో మార్నింగ్ వాక్ చేస్తున్న అరవై ఏళ్ల నాగరాజ్ అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి రామలింగ రెడ్డి, మృతుడి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. ఆ ఏనుగును పట్టుకునేందుకు సుమారు వంద మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, డ్రోన్లతో నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు.