పిజిఆర్ఎస్ సేవలపై క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలపాలని కలెక్టర్ పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిత్తూరు
ప్రజా సమస్యల పరిష్కార వేదికపై పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని తెచ్చింది. జిల్లా, మండల స్థాయి కేంద్రాలలో క్యూఆర్ కోడ్ను ప్రముఖంగా ప్రదర్శించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పౌరులు తమ మొబైల్స్ ద్వారా కోడ్ను స్కాన్ చేసి సేవలు, అధికారుల పనితీరుపై అభిప్రాయాలను సమర్పించవచ్చని తెలిపారు.