శాసనసభలో తెలంగాణ ప్రజా విశ్వాసం చట్టం బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో ‘తెలంగాణ ప్రజా విశ్వాసం చట్టం బిల్లు’ను ప్రవేశపెట్టారు. వ్యాపార సంబంధిత చట్టాల్లోని చిన్నపాటి సాంకేతిక ఉల్లంఘనలను నేరపూరిత పరిధి నుంచి తొలగించి, పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.