తెలంగాణలో సీలింగ్ చట్టం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీలో ల్యాండ్ సీలింగ్ చట్టం ఉల్లంఘనలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పరిమితికి మించి ఉన్న మిగులు భూములను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో సీలింగ్ చట్టం అమలు, సేకరించిన భూములు, పేదలకు పంచిన విస్తీర్ణంపై రెవెన్యూ శాఖ వద్ద సరైన లెక్కలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. సెక్షన్ 22ఏ కింద వందలాది కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.