స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు: పుల్లారెడ్డి మిఠాయిల లైసెన్స్ రద్దు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
మహానగరంలో దీపావళి పండుగ వేళ ప్రముఖ స్వీట్ షాపుల్లో టీజీ సేఫ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయని అధికారులు తెలిపారు. పుల్లారెడ్డి స్వీట్స్ తయారీ కేంద్రంలో కుళ్లిన పదార్థాలు, ఎలుకల పిక్కలు లభ్యం కావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌ను సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. పరిశుభ్రత లోపాలు, కల్తీ ఆహార విక్రయాల కారణంగా పలు ఇతర ప్రముఖ మిఠాయి దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన ఐదు షాపులను మూసివేయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.