RWS కాంట్రాక్టర్లకు రూ.620 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RWS కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిస్తూ రూ.620 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకునేందుకు నిధులు విడుదల చేయడం పట్ల కాంట్రాక్టర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ తాజా నిధులతో రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి.