చెర్లపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో కదం తొక్కిన శ్రేణులు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాతవరం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లపాలెం గ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం మాజీ డైరెక్టర్ తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామస్థులను కలుసుకుంటూ తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు విస్తృతంగా అభ్యర్థించారు.