వైకాపాకు ఓట్లు అడిగే నైతిక హక్ కు లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రిపోర్టర్: సురేష్ స్థలం: సొదలకూరు

ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్ కు వైకాపాకు లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. పొదలకూరు మండలం ప్రగతి నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడ్డారే తప్ప అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. గ్రామాల్ లో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.