నర్సంపేటలో శివాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజలు

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేటలో శివాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు మహా అన్నప్రసాదం వడ్డించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యత పెంపొందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.